YouTube Premium gets a price hike in India by up to 58%: ఇండియాలో యూట్యూబ్ వినియోగ దారులకు ఎదురు దెబ్బ తగిలింది. ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ధరలు పెరిగిపోయాయి. ఏకంగా 58% వరకు ప్రీమియం ధరలు పెంచింది యూట్యూబ్. దీంతో ఇండియాలో యూట్యూబ్ వినియోగ దారులకు షాక్ తగిలింది. భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియంను 2019లో రూ. 129 నెలకు పెంచింది యూట్యూబ్.

ఇక దాదాపు 5 సంవత్సరాల తర్వాత, మళ్లీ యూట్యూబ్ కంపెనీ.. ప్రీమియం సభ్యత్వం ధరను రూ. 149కి పెంచింది. యూట్యూబ్ ప్రీమియం కుటుంబ సభ్యత్వం ధర నెలకు రూ. 189 మొన్నటి వరకు ఉండేది. అయితే.. ఇప్పుడు దీని ధర కూడా పెరిగింది. యూట్యూబ్ ప్రీమియం కుటుంబ సభ్యత్వం ధర నెలకు రూ. 299 కు పెరిగింది. అంటే ఇది 58.2% పెరుగుదల అన్న మాట. కాబట్టి, ఇప్పుడు మీరు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడే కుటుంబ సభ్యత్వం ప్లాన్ మంచి అన్న మాట.