కోహ్లీతో జర్నీ గర్వంగా ఉంది : యువరాజ్

-

విరాట్ కోహ్లీ….. నేటి కాలంలో ప్రతి బౌలర్ కు వణుకు పుట్టించే పేరు. కోహ్లీ తన రిథమ్ లో ఉంటే ఏ బౌలర్ నైనా ఉతికి పారేస్తాడు. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అందరూ ఎదురుచూస్తున్న 49వ వన్డే సెంచరీకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ ను సమం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇవాళ కోహ్లీ బర్త్‌ డే కూడా ఉంది.

yuvi wishes kohli

ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పెషల్ స్వీట్ చేశారు. ‘జట్టులో యువకుడిగా అవకాశాల కోసం ఎదురుచూస్తూ…..ప్రదర్శన చేయాలని కుతూహలంతో ఉండేవాడివి. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మరో ఏడాది రికార్డులు బ్రేక్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి. నీతో జర్నీ షేర్ చేసుకున్నందుకు గర్వంగా ఉంది. నీకు ఆటపట్ల ఉన్న నిబద్ధత దేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news