సైనికుల దేశ భక్తి కి జిందాబాద్…!

-

కరోన వైరస్ దెబ్బకు మన దేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాస్త ఊపు తగ్గి ఉండవచ్చు గాని సరిహద్దుల్లో సైనికులు మాత్రం దేశ భక్తిని ప్రదర్శించారు. జమ్మూ కాశ్మీర్ లోని బండిపోరా జిల్లాలో గురేజ్‌లోని మంచు పర్వతం పైన జాతీయ జెండాను ఎత్తి ఆగస్టు 15 న గుర్తుగా ఒక వీడియో ని భారత ఆర్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక డ్రోన్ ఈ వీడియో ని షూట్ చేసింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతంలో సైనికులు ఉన్నారు. జెండా ఎత్తిన తరువాత, జాతీయ గీతం యొక్క వాయిద్య రూపంలో వినిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ వీడియో కి ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. భారత ఆర్మీ దేశ భక్తిని పలువురు కీర్తిస్తున్నారు. ఇక మన దేశ వ్యాప్తంగా వేడుకలు ఏ మాత్రం హడావుడి లేకుండా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news