పార్లమెంట్ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభం అయింది. మొత్తం 60 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. దీంతో 50 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ మరో 36 స్థానాల్లో ఘన విజయం సాధించింది.
దీంతో మొత్తం 46 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన కాషాయ పార్టీ మరోసారి అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండూ అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ రాష్ట్ర బీజేషీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఎన్ పీఈపీ 5, ఎన్సీపీ 3, పీపీఏ 2, కాంగ్రెస్ 1 స్థానంలో మాత్రమే విజయం సాధించాయి.