పాకిస్తాన్ మాజీ ప్రధాన నవాబ్ షరీఫ్ ఇండియా పై ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండడంతో మరోసారి ప్రధానిగా ఎన్నికలలో గెలిచి ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా లండన్ లో ఉంటున్న ఇటీవలే పాకిస్తాన్ కి వచ్చాడు. ఇతడు పాకిస్తాన్ ముస్లిం లీగ్ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నాడు. మన చుట్టుపక్క దేశాలు చంద్రుని పైకి చేరుకుంటున్నాయని మనం మాత్రం భూమి పైనుంచి లేవడం లేదని ఈరోజు పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి మనమే కారణమని మరెవరు బాధ్యులు కారని స్పష్టం చేశారు.
2013లో దేశంలో తీవ్రమైన విద్యుత్ కొరత సమస్యను ఎదుర్కొందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సమస్యలు తగ్గాయని, కరాచీలో హైవేలు నిర్మించామని, ఉగ్రవాదాన్ని అణచివేసామని, ఒప్పందం కూడా కుదిరిందని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.1993,1999,2017 లో ప్రధానిగా పనిచేసినప్పటికీ పూర్తి కాలం పదవి ముగియకముందే దించివేయబడ్డడు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ తో మంచి సంబంధాలు ఉండేవని తనకు తెలియకుండానే కార్గిల్ యుద్ధం జరిగిందని చెప్పాడు.