నయనతార, విగ్నేష్ ల పెళ్లి కార్డు వైరల్

-

లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు నడవనున్నారు. రేపు (జూన్9) న మహాబలిపురంలో నయన్, విగ్నేష్ ల వివాహం జరగనుంది. రీసెంట్ గా తమ పెళ్లి విషయాలను మీడియాతో పంచుకున్నారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ పెళ్లి జూన్ 9న మహాబలిపురంలో జరగనుందని క్లారిటీ గా చెప్పారు.

అంతేకాక పెళ్లికి సంబంధించిన మరిన్ని విషయాలను కూడా చెప్పేశారు. మై లవ్ నయన్ ను పెళ్లి చేసుకోబోతున్నానని, మా ఇరువురి కుటుంబాల తో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంప్రదాయ దుస్తుల్లో వివాహానికి హాజరు కావాలని ఆ వివాహ పత్రిక లో రాసి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news