దక్షిణ ఢిల్లీ సంగమ్ విహార్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేస్తుండగా.. స్థానిక ట్రాఫిక్ ఎస్ఐతో కొందరు వాగ్వాదానికి దిగారు. ప్రజలు ఒక్కసారిగా ఎస్ఐపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఓ యువతి.. ట్రాఫిక్ ఎస్ఐ కాలర్ పట్టుకుని చెంపలు చెళ్లుమనిపించింది. దీని ఆధారంగా చూస్తే ఆ ఎస్ఐ యువతితో అసభ్యంగా ప్రవర్తించి ఉన్నట్లు సమాచారం.
యువతితోపాటు మరో యువకుడు, యువతి అతనిపై దాడికి దిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ మేరకు ట్రాఫిక్ ఎస్ఐను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి టిగ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన యువతి.. ఎస్ఐ తనపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించింది. అయితే ఘటనా స్థలంలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఎస్ఐని రక్షించారు.
COP ASSAULTED IN DELHI
A traffic cop was assaulted in public in South #Delhi's Sangam Vihar. The cop was later dragged by his collar and slapped. @nagar_pulkit reports. pic.twitter.com/FY2Sn9JYyr— Mirror Now (@MirrorNow) June 8, 2022