గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నయనతార.. ఏమైందంటే..?

-

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి.. అందం, అభినయంతో యువతను ఆకట్టుకున్న ఈమె కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ మూడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. మరొకవైపు ఇరైవన్ అనే తమిళ సినిమాలో కూడా నయనతార హీరోయిన్గా నటిస్తోంది.

లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు మరొక మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందని సమాచారం. తమిళ సూపర్ స్టార్ కమలహాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ రాబోతోందని సమాచారం. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ లవ్ టుడే మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ , మరో యువ నటి కూడా ముఖ్యపాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా లేడీ సెంట్రిక్ మూవీగా రాబోతోందని సమాచారం.

ఇక నయనతార విషయానికి వస్తే విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలలో జోరు పెంచేసి పారితోషకం కూడా పూర్తిస్థాయిలో డిమాండ్ చేస్తోంది. జవాన్ సినిమాలో నటించడానికి సుమారుగా రూ. 15 కోట్లకు పైగా పారితోషకం డిమాండ్ చేసిందని తెలుస్తోంది. పారితోషకం పెంచుకుంటూ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది నయనతార.

Read more RELATED
Recommended to you

Exit mobile version