బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో బాలీవుడ్ కమెడియన్ అరెస్ట్

బాలీవుడ్‌ కామెడీ క్వీన్‌ భారతీ సింగ్‌ కు భారీ షాక్‌ తగిలింది. ఆమెను ఈరోజు కొద్ది సేపటి క్రితం నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెను ప్రశ్నించిన తరువాత అరెస్టు చేశారు. నిజానికి ముంబైలో ఆమె నివాసంపై ఈరోజు ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసింది.  భారతి సింగ్‌తోపాటు, ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

డ్రగ్ పెడ్లర్ విచారణలో భారతి సింగ్‌ పేరు వెలుగులోకి రావడంతో ,ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం ఈ దాడులు చేపట్టింది. కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని  సీనియర్‌ అధికారి తెలిపారు. దీంతో భారతి, ఆమె భర్త హర్ష్ లింబాచియాకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. ఇక కొద్ది సేపటి క్రితమే ఆమెను అరెస్ట్ చేశారు. ఒక ఎన్‌సిబి అధికారి ప్రకారం  ముంబైలోని మరో రెండు ప్రదేశాలలో కూడా ఏజెన్సీ శోధనలు నిర్వహించినట్లు తెలిపారు.