డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కి మళ్లీ నిరాశే…

-

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. మూడోసారి బెయిల్ పిటీషన్ పెట్టుకున్న ఆర్యన్ ఖాన్ కు చుక్కెదురైంది. తాజాగా ముంబై కోర్ట్ బెయిల్ పై తీర్పును ఈనెల 20కి రిజర్వ్ చేసింది. దీంతో ఈనెల 20 వరకు ఆర్యన్ ఖాన్ జైలులో గడపాల్సిందే. ఈనెల అక్టోబర్ 2న ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అతని స్నేహితులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్సీబీ ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ఆర్యన్ ఖాన్ లాయర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయతే ఎన్సీబీ బెయిల్ ను వ్యతిరేఖిస్తూ బలంగా వాదిస్తుండటంతో కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదు. తాజా ఈరోజు కూడా ఎన్సీబీ బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరింది. ఆర్యన్ ఖాన్ గత మూడేళ్ల నుంచి తరచుగా డ్రగ్స్ తీసుకుంటున్నాడనే అభియోగాలను కోర్టుకు తెలిపింది. బయటకి వస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంటుందని ఎన్సీబీ కోర్టకు విన్నవించింది. దీంతో కోర్టు ఈనెల 20న ఆర్యన్ ఖాన్ బెయిల్ పై తీర్పును వెల్లడించనుంది. వరసగా కోర్టుకు 5 రోజులు సెలవులు ఉండటంతో ఈ ఐదు రోజులు ఆర్యన్ ఖాన్ జైలులో ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news