డ్రగ్స్‌ కేసు విచారిస్తున్నజడ్జికి బెదింపులు..బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ లేఖ.

-

కర్ణాటక డ్రగ్స్​ కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది..శాండిల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ వేగవంతం చేసిన సీసీబీ పోలీసులు ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే..తాజాగా సెలబ్రిటీ డ్రగ్ రాకెట్ కేసును విచారించిన ఎన్డీపీఎస్ ప్రత్యేక న్యాయమూర్తికి బెందిరింపు లేఖలు వస్తున్నాయి..డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన వారికి వారికి బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ లేఖ పంపారు గుర్తు తెలియని వ్యక్తులు..డ్రగ్స్‌ కేసులో రాగిని ద్వివేది, సంజన గల్రానీలతో సహా కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు..వారికి బెయిల్ మంజూరు చేయాలని, అదే విధంగా ఆగస్టు 11 న ఇక్కడి కేజీ హల్లి, డీజే హల్లి ప్రాంతాల్లో జరిగిన హింసాకాండలో అరెస్టయిన అమాయక వ్యక్తులను వెంటనే విడుదల చేయాలని బెదిరింపు లేఖలో ఉందని.. బెదిరింపు లేఖ వచ్చిన పార్శిల్ అందుకున్న సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, జిల్లా ప్రధాన కార్యాలయమైన తుమకూరు నుండి ఒక పార్శిల్ కోర్ట్‌కు వచ్చిందని..సిబ్బంది దానిని తెరిచారు దానిలో అనుమానాస్పదమైన వస్తువు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు..పార్శిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో మాదకద్రవ్యాల కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తికి రాసిన లేఖ ఉందని..డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన వారికి వారికి బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ లేఖ పంపారని పోలీసులు తెలిపారు..లేఖలో కర్ణాటకకు చెందిన సినీ నటీమణులు డ్రగ్స్ కేసులో నటీమణులు, కొద్దిమంది నైజీరియన్లు, రియల్టర్లు, రేవ్ పార్టీ నిర్వాహకులు సహా 15 మందికి పైగా అరెస్టయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news