మాంసాహారం తీసుకునే వారికి ఎక్కువగా ఇష్టం అయిన వంటకం చికెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనదేశంతో పాటు, ప్రపంచంలోనే అత్యధికంగా చికెన్‌ను ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. స్కిన్ లెస్ అని, బోన్ లెస్ అని ఇలా చాలానే ఉన్నాయి. పేరు ఏదైతేనేం అంతా ఒకటే కదా అంటారా. అయితే తాజాగా.. ఒ వ్యక్తి మాత్రం బోన్‌లెస్ చికెన్ అనే పేరు మార్చాలని డిమాండ్ చేసి అందరని షాక్ కి గురి చేశాడు.
నెబ్రాస్కాకు చెందిన అండర్ క్రిస్టిన్‌సన్ బోన్‌లెస్ చికెన్ పేరును మార్చాలంటూ ఏకంగా ఆ దేశానికి చెందిన లింకన్ సిటీ కౌన్సిల్‌లో తీర్మానం చేయడం ఆశ్చర్యం కలిగించింది. బోన్‌లెస్ చికెన్ వింగ్స్ అనేవి చికెన్ వింగ్స్ నుంచి రావని, అది బ్రెస్ట్ ప్రాంతం నుంచి వస్తుందని, కాబట్టి అందులో బోన్స్ ఉండే అవకాశం లేదని పేర్కొన్నాడు. మనం చాలా కాలంగా అబద్ధాల్లో బతికేస్తున్నామని, కాబట్టి బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలని కోరారు.
Don’t want to get too political here … but he has a point. #SaucyNugs #KeepLNKWeird pic.twitter.com/uFgpyTRAAV
— Ethan Rowley (@e10rowley) September 2, 2020