‘నీట్’ పరీక్షావిధానంపై వెనక్కి తగ్గిన కేంద్రం

-

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ను సంవత్సరానికి రెండు సార్లు ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలనే నిర్ణయం పై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ పద్ధతి వల్ల గ్రామీణ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు తీవ్ర నష్టం జరగనుందని విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్రం ఈ పరీక్షను పెన్నూపేపర్ విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. నీట్ 2019 పరీక్షకై రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1 నుంచి ప్రారంభం కానుంది, మే 5న పరీక్షను నిర్వహించి, జూన్ 5న ఫలితాలు ప్రకటిస్తామని  కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news