టాలీవుడ్ చెడ్డది.. కేవలం ఆ నాలుగు ఫ్యామిలీలే..!

-

టాలీవుడ్ పై మరోసారి విరుచుకు పడ్డది సంచలనాల శ్రీరెడ్డి. ఈరోజు రెడ్డి డైరీ అనే సినిమా ప్రకటించిన శ్రీరెడ్డి ఆ సినిమా ద్వారా అందరి బాగోతాలను బయట పెడతా అంటుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధం ప్రకటించిన శ్రీరెడ్డి మధ్యలో తన టార్గెట్ మారేసరికి సైలెంట్ అయ్యింది. టివి ఛానెల్స్ ఎవరు తనని పిలవడం లేదని కొన్నాళ్లు సోషల్ మీడియా.. యూట్యూబ్ ఛానెల్స్ చుట్టూ తిరిగిన శ్రీరెడ్డి తన ఫోకస్ తెలుగు పరిశ్రమ నుండి తమిళ పరిశ్రమకు మార్చింది.

అక్కడ తానేంటో తెలియపరచడం కోసం లారెన్స్, శ్రీరామ్ ల మీద కామెంట్స్ చేసింది. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటూ కోలీవుడ్ లో సినిమా అవకాశాలను అందుకుంటున్న శ్రీరెడ్డి సిని పరిశ్రమలన్నిటిలో టాలీవుడ్ చెడ్డదని అంటుంది. ఇక తన చేతిలో రెడ్డీస్ డైరీతో పాటుగా మరో రెండు సినిమా అవకాశాలు ఉన్నాయని అంటుంది. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం నాలుగు కుటుంబాల చేతుల్లోనే ఉందని అంటుంది శ్రీరెడ్డి.

అమ్మడి మాటలను పట్టించుకోవడం ఎప్పుడో మానేసిన జనాలు మళ్లీ చేసిన వ్యాఖ్యలకు పెద్దగా స్పందించడం లేదు. వేరే ఇండస్ట్రీకి వెళ్లి తెలుగు పరిశ్రమ మీద కామెంట్లు చేస్తున్న శ్రీరెడ్డికి ఎలాంటి షాక్ తగలనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news