నీట్‌ (యూజీ) అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

-

నీట్ పరీక్షలు రాసే విద్యార్థులకు అలర్ట్. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG 2024) పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. మే 5వ తేదీన (ఆదివారం) జరిగే ఈ పరీక్షకు ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA).. తాజాగా అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

నీట్‌ పరీక్షకు ఈసారి 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్న విషయం తెలిసిందే. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు 557 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. విదేశాల్లో 14 సిటీల్లో నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి విద్యార్థులు తమ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే 011-40759000 లేదా [email protected]కు ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

నీట్ యూజీ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Read more RELATED
Recommended to you

Latest news