ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు.. ఇదీ నెల్లూరు ప్రొఫెసర్ బాగోతం!

నెల్లూరు: ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు.. ఇది సినిమా. భార్య ఉండగానే ఇంట్లోనే ప్రియురాలితో రాసలీలలు. అచ్చం సినిమాలో మాదిరే సీన్లు. స్వేచ్ఛగా జరిగిన అక్రమసంబంధానికి భార్య అడ్డుగా మారింది. దీంతో భర్త శాడిజాన్ని చూపించాడు. భర్త వేధింపులు తాళ్లల్లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త. ఈ ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది.

విక్రమసింహపురి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చెంచురెడ్డి పని చేస్తున్నారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వంటింట్లో అనధికారికంగా ఇంకో మహిళ కూడా ఉన్నారు. ఆమెకు యూనివర్సిటీలో అటెండర్‌గా ఉద్యోగం ఇప్పించారు. హ్యాపీగా సాగుతున్న వీరి అక్రమ సంబంధంలో భార్య అడ్డుగా ఉన్నారు. వీరిద్దరిపై భార్యకు అనుమానం రావడంతో చెంచురెడ్డిలో ఉన్న శాడిజం కూడా బయటకు వచ్చింది. భార్య, పిల్లల్ని ప్రతి రోజూ చితకబాదుతున్నారు. ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తూ భార్యకు నరకం చూపిస్తున్నారు. రోజుల తరబడి భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. భార్యను ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నారు. ఇది చాలా సార్లుగా జరిగింది. తాజాగా కూడా జరగడంతో భార్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని శిక్షించాలని కోరుతున్నారు.