పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఒక్క అడుగు జాగ్రత్తగా వేయాలని భావిస్తున్నారు. కానీ ప్రతిసారి ఆయన ఆలోచనలు కొంత బెడిసికొడుతున్నాయనే చెప్పాలి. మొదట్లో కమ్యూనిస్టులతో పొత్త పెట్టుకున్న పవన్.. ఆ తర్వాత ఆ పార్టీలకు పూర్తి విరుద్ధమైన కమలం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయితే దీన్నే బీజేపీ అడ్వాంటేజీగా వాడుకోవాలని చూస్తోంది.
పవన్ అడ్డం పెట్టుకుని ఎలాగైనీ ఏపీలో బలపడాలని భావిస్తోంది. అయితే అనూహ్యంగా పవన్ కల్యాణ్ ఈ మధ్య అనేక విషయాల్లో బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఏపీలో జగన్ సర్కార్ పై కమలనాథులు ఉద్యమాలకు పిలుపిస్తూ రోజుకో జిల్లాలో అగ్గి రాజేస్తున్నారు. కానీ జనసేన, పవన్ కళ్యాణ్ ఈ నిరసనల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు.
కనీసం ఈ విషయాలపై ట్వీట్లు కూడా చేయకపోవడంతో అసలు పవన్ మదిలో ఏముందో ఎవరికీ అర్థం కావట్లేదు. నిజంగా పవర్ స్టార్ బీజేపీకి దూరం కావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీతో ఉంటే తమ పార్టీకి గుర్తింపు ఉండదని పవన్ భావిస్తున్నారు. ప్రతి విషయంలో బీజేపీ చెప్పిన్టు వినాల్సి వస్తుందని పవన్ ఆలోచిస్తున్నారు. మరి దూరంగా ఉంటారో లేదో చూడాలి.