ట్రైలర్‌ : ”నేనే నా.. ?” అంటూ వచ్చేసిన రెజీనా

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌ ఉండే వారిలో ఒకరు రెజీనా. నటన ను నిరూపించుకునే సరైన సినిమా రాక మీడియం హీరోయిన్‌ గానే మిగిలిపోయింది రెజీనా. ఇక ఈ మధ్య తెలుగు సినిమా కూడా తగ్గించేసింది. అడవి శేష్‌ నటించిన ‘ఎవరు’ సినిమా అనంతరం ఈ అమ్మడు పెద్దగా సినిమా చేయలేదు.

ఇక తాజాగా ఈ భామ మరో సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా నేనేనా.. అనే సినిమా చేస్తోంది రెజీనా. ఇక ఈ సినిమాలో రాణిగా, పురావస్తు వేత్తగా డ్యూయల్‌ రోల్‌ చేయనుంది రెజీనా. నిను వీడని నీడనున నేనే లాంటి హిట్‌ సినిమాలు డైరెక్ట్‌ చేసిన కార్తీక్‌ రాజ్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఇది ఇలా ఉండగా… తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను నిధి అగర్వాల్‌, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, స్టార్‌ డైరెక్టర్‌ లింగు సామి ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే.. 100 ఏళ్ల కింద జరిగిన ఓ భయంకరమైన ఘటన ఇప్పుడు గుర్తుకు వస్తోంది. కాగా.. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.