“పెళ్లి సందD” టీజర్ విడుదల..!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఇక ఈ సినిమా కు సీక్వెల్ గా పెళ్లి సందడి సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ కుమారుడితో పెళ్ళి సందD చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కు రాఘవేంద్ర రావు దర్శకేంద్ర పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరీ రోనంకి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

టీజర్ లో రాఘవేద్రరావు మార్క్ కనిపిస్తోంది. కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రొమాంటిక్ సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ ఫైట్ లతో రెచ్చిపోయాడు. అంతే కాకుండా నటన తోనూ ఆకట్టుకున్నాడు. సినిమా టెక్నికల్ విలువలు భాగున్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి భారీ తారాగణం కనిపిస్తోంది. ఇక శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమా ఇండస్ట్రీ లో సూపర్ హిట్ గా నిలిచింది. మరి రోషన్ పెళ్లి సందD ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.