ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తన యూజర్లకు అందుబాటులోకి తెస్తూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అనేక ఫీచర్లు ఇప్పటికే వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా మల్టీ డివైస్ సపోర్ట్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.
మల్టీ డివైస్ సపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్నామని వాట్సాప్ గతంలోనే ప్రకటించింది. అయితే అలా ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఆ ఫీచర్‌పై వాట్సాప్ ఎలాంటి ప్రకటనను మళ్లీ చేయలేదు. కానీ తాజాగా వాట్సాప్ బీటా వెర్షన్‌కు వచ్చిన అప్డేట్లో మల్టీ డివైస్ ఫీచర్‌ను అందించారు. ఈ క్రమంలోనే వాట్సాప్‌ను ఏక కాలంలో 4 డివైస్‌లలో వాడవచ్చు.
ఇంతకు ముందు వాట్సాప్‌లో ఒక అకౌంట్‌ను ఒకే డివైస్‌లో వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక అకౌంట్‌ను 4 డివైస్‌లలో వాడవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లోనే అందుబాటులో ఉంది. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది.