భారత పర్యాటకులపై నేపాల్‌ నిషేధం

-

కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులపై నేపాల్‌ నిషేధం విధించింది. ఇలా వచ్చిన నలుగురు భారతీయులకు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో వారిని వెనక్కి పంపిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురూ ఝులాఘాట్‌ సరిహద్దు ప్రాంతం గుండా నేపాల్‌లోని బైతాడీ జిల్లాలోకి ప్రవేశించారు. వారికి పాజిటివ్‌గా తేలినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

భారతీయులకు కొవిడ్‌ పరీక్షలు కూడా పెంచినట్లు చెప్పారు. భారత్‌ నుంచి తిరిగివచ్చిన నేపాలీలూ పలువురు కొవిడ్‌ బారినపడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు నేపాల్‌లోకి ప్రవేశించకుండా నిలిపివేసినట్లు చెప్పారు. నేపాల్‌లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం 1,090 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 6 నెలల్లో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

టిబెట్‌లో కొవిడ్‌ కేసులు బయట పడటంతో ప్రఖ్యాత పటోలా సౌధాన్ని చైనా అధికారులు మూసివేశారు. కొత్తగా ఒక్క కేసూ రాకూడదన్న (జీరో-కొవిడ్‌) విధానాన్ని అమలుచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రముఖ టిబెట్‌ బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటలా సౌధాన్ని మంగళవారం నుంచి మూసివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎప్పుడు తెరిచేదీ తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. టిబెట్‌ ఆదాయం ప్రధానంగా పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. ఇందులో పటోలాయే కీలకం. చైనాలో మంగళవారం 828 కొత్త కేసులు బయటపడగా.. వాటిలో 22 టిబెట్‌లో నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news