వీడు వీడి వేషాలు.. నెట్ ఫ్లిక్స్ కౌంటర్ ఆహాని ఉద్దేశించేనా?

-

ఓటీటీ ఫ్లామ్ లలో మేజర్ షేర్ ఉన్న నెట్ ఫ్లిక్స్ తెలుగులో ఒరిజినల్ సిరీస్ తో ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ ని పిట్ట కథలుగా రీమేక్ చేసి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులోకి వచ్చేస్తున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా నెట్ ఫ్లిక్స్ కొంత సందడి చేసింది. ఆ సందడికి కౌంటర్ గా వందశాతం తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన ఆహా, మా దగ్గర చాలా ఒరిజినల్స్ ఉన్నాయి. మేము అరుస్తున్నామా అంటూ ట్వీట్ చేసింది.

ఐతే ఆ ట్వీట్ కి కౌంటర్ అటాక్ ఈరోజు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ స్పందిస్తూ నో ఫైటింగ్ బాధ్యత ఉండక్కర్లా అని మీమ్ పెట్టి, వీడూ వీడి వేషాలు అని ట్వీట్ చేసింది. మొత్తానికి తెలుగులో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మధ్య వాడి వేడి యుద్ధం జరగనుందని తెలుస్తుంది. ఈ రెండు ట్వీట్ల వల్ల ప్రేక్షకులకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేసింది. తెలుగులో దూసుకుపోతున్న ఆహా ని మరిన్ని ఒరిజినల్స్ ద్వారా నెట్ ఫ్లిక్స్ అందుకుంటుందేమో చూడాలి. ఆహాలో రిలీజైన సూపర్ ఓవర్ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. పిట్ట కథలు సిరీస్, ఫిబ్రవరి 9వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news