ఇండియా ఓటమికి కారణమైన ఆస్ట్రేలియా ప్లేయర్ భార్యపై అసభ్యకర కామెంట్స్…!

నిన్న కోట్లాది మంది అభిమానులు చూస్తుండగా ఇండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యి ఎన్నో విమర్శలకు తావిచ్చింది. ఈ ఓటమిని అభిమానులు మరియు ప్లేయర్స్ సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్ లో ఇండియా ఓటమిని ఖరారు చేసిన ప్లేయర్ గా ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ నిలిచిపోయాడు. ఇతను ఈ మ్యాచ్ లో అద్భుతమైన శతకాన్ని (137) సాధించి ఇండియాను గట్టి దెబ్బ తీశాడు. అయితే తాజాగా ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ పై దారుణంగా కామెంట్స్ చేశారు. అది కూడా జెస్సికా తన పాపతో ఉన్న ఫోటో ను ఉద్దేశించి కొందరు ఆకతాయిలు ఆలా కామెంట్ చేశారట. ఈ కామెంట్ లను గమనించిన కొందరు ఇది పద్ధతి కాదు.

మన భారతీయ సంస్కృతిలో ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఖండిస్తున్నారట. ఎంతమాత్రం ఇండియా పై చెలరేగి ఆడాడని ఇలా పాగా తీర్చుకోవడం ఏమిటి అంటూ చాలా మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.