రాజమౌళి బైక్‌పై రెండు నెంబర్ ప్లేట్లు..హైదరాబాద్ సిటీ పోలీస్ రియాక్షన్ ఇదే..

-

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి పోలీసులు జరిమానా విధించే సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఇటీవల డిజిటల్ గానూ ఫైన్స్ విధిస్తున్నారు. ఏదేని ప్రాంతానికి చెందిన వాహనాల ఫొటోలను డిజిటల్ గా పోలీసులకు ట్యాగ్ చేసి షేర్ చేస్తే వాటిని పరిశీలించి తగు జరిమానా విధిస్తున్నారు.

ఈ క్రమంలోనే నెటిజన్లు వివిధ ప్రాంతాల్లో నియమ, నిబంధనలు పాటించిన వాహనాలు ఫొటోలు, ప్రాంతం ఇతర వివరాలు ట్వీట్ చేస్తుంటారు. వాటిని హైదరాబాద్ సిటీ పోలీసులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుంటారు. కాగా, తాజాగా RRR ఫిల్మ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికపైన కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కంప్లయింట్ చేశాడు.

ఒకే బైక్ కు రెండు నెంబర్ ప్లేట్లు పెట్టాడు రాజమౌళి..అది ఎలా సాధ్యమయింది? అని ప్రశ్నిస్తూ RRR సినిమాలోని తారక్ బైక్ నడిపిన ఫొటోలు షేర్ చేశాడు. సదరు ఫొటోల్లో బైక్ పైన నెంబర్ ఒక చోట 5079 అని రాసి ఉంది. మరో చోట DL1030 అని రాసి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళిపైన కేసు పెట్టాలని నెటిజన్ ఫన్నీగా డిమాండ్ చేశాడు.

ఇక ఈ ట్వీట్ చూసిన హైదరాబాద్ సిటీ పోలీసు ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ వారు ఫన్నీగానే స్పందించారు. ప్రాంతం, తేదీ, సమయం తెలపండి అని ఫన్నీ సింబల్స్ పెట్టి రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. నెంబర్ ప్లేట్ మీద డీఎల్ అనంగా ఢిల్లీ పోలీసులు కాబట్టి ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేయాని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ కేసు హైదరాబాద్ పోలీసుల పరిధిలోకి రాదని చెప్తున్నారు. మొత్తంగా సినిమాలోని బైక్ సీన్ గురించి సోషల్ మీడియాలో ఇంత చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news