రాజమౌళి వల్లే తెలుగు ఇండస్ట్రీ.. మునిగిపోయిందంటున్న నెటిజన్స్.. కారణం..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీని పంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే అని చెప్పవచ్చు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అన్ని ఇండస్ట్రీలు తిరిగి చూడడం జరిగింది. బాహుబలి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో.. మొదటిసారిగా తెలుగులో కూడా పాన్ ఇండియా చిత్రాలకు పునాది వేశారు డైరెక్టర్ రాజమౌళి. కానీ ఇలాంటి రాజమౌళిని ఇప్పుడు కొంతమంది నాశనం అవ్వడానికి ఈయనే కారణమంటూ కామెంట్ చేస్తున్నారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడు అయినా సరే.. బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం రాజమౌళి వల్ల తెలుగు ఇండస్ట్రీ చానా నష్టాలను మిగిల్చినట్లుగా సమాచారం. బాహుబలి సినిమా కోసం రాజమౌళి దాదాపుగా ఐదేళ్ల సమయాన్ని తీసుకున్నారు. ఇక ఇందులో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క తదితరులు నటించడం జరిగింది. అయితే ఐదేళ్లలో ప్రభాస్ కేవలం బాహుబలి-1, బాహుబలి-2 మాత్రమే విడుదల చేశారు. ఇక ఈ సినిమాకి కేవలం ఎంత సమయాన్ని కేటాయించడంతో బిజినెస్ పరంగా తెలుగు ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ఇండస్ట్రీలో ఉండే నటీనటులు, టెక్నీషియన్స్, తదితర వారికి తక్కువ పని దొరికిందని చెప్పవచ్చు.

అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ , రాజమౌళి కలయికలో వచ్చిన RRR చిత్రానికి కూడా మూడు సంవత్సరాలు పట్టింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో కూడా తెరకెక్కించబోయే సినిమాకు మూడు సంవత్సరాలు సమయం పడుతుందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళితో తీసిన హీరోలు నటీనటుల సైతం. ఈయనకు కేటాయించిన డేట్ల ప్రకారం చూసుకుంటే ప్రతి ఏడాదికి కూడా ఏదో ఒక సినిమాని విడుదల చేసేవారు. కానీ రాజమౌళి కారణంగా ఎన్నో సంవత్సరాలకు ఒక సినిమానే విడుదలవుతోంది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి బిజినెస్ పరంగా చాలా డల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం డైరెక్టర్ రాజమౌళి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news