నల్లజాతీయులైన భారతదేశ పౌరుల్లో తెల్లగా ఉండాలన్న కాంక్ష చాలామందిలో ఉందని, అందుకోసమే ఫెయిర్ నెస్ క్రీమ్స్ వాడుతుంటారని, తెల్లగా ఉండడమే గొప్ప, వాళ్ళే ఏదైనా సాధించగలరని నమ్మేవాళ్ళు ఎక్కువ అవుతున్నారని చాలామంది వాదన. ఈ మేరకు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చిన ఫిల్టర్ గురించి చర్చ జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ఈ ఫిల్టర్, నలుపు రంగులోకి మారుస్తుంది. మీరు తెల్లగా ఉన్నప్పటికీ నల్లగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది.
ప్రస్తుతం ఈ విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది. వైష్ణవి అనే ట్విట్టర్ ఖాతాదారు షేర్ చేసిన ప్రకారం, ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ఈ కొత్త ఫీచర్, నలుపు రంగులో ఉన్నవారిపై వివక్ష పెంచేదిగా ఉందని, ఇలాంటి చర్యలను ఇన్స్టాగ్రామ్ వెంటనే ఆపాలని కొన్ని ఫోటోలను షేర్ చేసారు. ఆ ఫోటోలని గమనిస్తే, నలుపు రంగులో ఉన్నవారిపై వివక్ష పెంచేదిగా ఉన్నట్టు, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నట్టు అనిపించకమానదు.
There's an actual blackface filter that ends up showing you differently towards the end when you shoot a reel on Instagram and Indian people are doing this like some Fair and lovely ad shit and glorifying it what is wrong with people! pic.twitter.com/Wn0Y1FOSRx
— Valia Babycats 🏳️🌈 (@Vaishnavioffl) July 24, 2021
ఫిల్టర్ ని ఉపయోగించి తమ ఒరిజినల్ కలర్ ని నలుపు రంగులోకి మార్చే ఫీచర్ ని ఉపయోగించిన వారందరూ చిత్ర విచిత్ర హావాభావాలతో కనిపించారు. చాలామంది నలుపు రంగులో వారి ముఖం కనిపించగానే ఆ రంగుని చూసుకుంటూ ముభావంగా మొహం పెట్టి, నా మొహం ఇలా అయ్యిందేంటి అని చూసుకుంటూ ఉన్నారు. అదే మళ్ళీ ఆ ఫిల్టర్ ని వాడకుండా ఒరిజినల్ ఫోటోలని ఉంచుతూ నవ్వుతూ కనిపించారు. దీనర్థం నలుపు రంగు తమని బాధిస్తుందని చెప్పినట్టే అని, ఒక రకంగా ఇది వివక్షను పెంచడమే అని వైష్ణవి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ విషయంలో అన్నివైపుల నుండి చర్చ ప్రారంభమైంది. మరి జాతి వివక్షను పెంచేలా ఉన్న ఈ ఫిల్టర్ ని ఇన్స్టాగ్రామ్ ఎలా పెడుతుందంటూ విమర్శలు వస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.