శృతిమించిన శ్రీ రెడ్డి.. ఏంటీ కర్మ అంటున్న నెటిజన్స్..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటి శ్రీరెడ్డి సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొత్తలో హీరోయిన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ కూడా ఇచ్చిందని వార్తలను ఆమె స్వయంగా వెల్లడించింది. ముఖ్యంగా దర్శకనిర్మాతలు ఆమెలో ఉన్నటువంటి బ్యూటీ యాంగిల్ ను మాత్రమే చూసి లోపరుచుకోవాలని అనుకున్నారు. అంతేకాదు అవకాశాల పరంగా వారి చేతిలో మోసపోయి తన లాగా మరెవరు మోసపోకూడదని ఏకంగా క్యాస్టింగ్ ఉద్యమానికి కూడా తెరలేపింది.

ఈ క్రమంలోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న శ్రీరెడ్డి అర్ధ నగ్నంగా మా బిల్డింగ్ ముందు నిలబడి అందరి బండారాలు బయట పెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒక ప్రముఖ హీరో ఫ్యామిలీని మీటూ ఉద్యమం పేరుతో టార్గెట్ చేయడం అలాగే ఆ హీరో తల్లిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈమెను ఇండస్ట్రీ పెద్దలు బహిష్కరించారు. దాంతో అప్పటినుంచి నటి శ్రీరెడ్డి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉంటూ కోలీవుడ్లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తోంది . కానీ దురదృష్టం ఏమిటంటే అక్కడ కూడా ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఇకపోతే ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా మాధ్యమాలలో తనకు ఉన్నటువంటి ఫాన్ ఫాలోయింగ్ ను బాగానే క్యాష్ చేసుకుంటోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈమె డిజిటల్ మనీ పైపు దృష్టి సారించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మాధ్యమాలలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఎద అందాలతో దాడి చేస్తోంది. ఇక ఆ వీడియోలో తన డాన్స్ ప్రతిభ గురించి చెబుతూ ఇండియన్స్ కూడా డాన్స్ చేయగలరు.. అయితే నేను కాస్తంత తక్కువ అని చెప్పవచ్చు అంటూ శ్రీరెడ్డి డాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇక ఆమె పోస్ట్ చేసిన వీడియోలో తన ఎద అందాలను చూపిస్తూ.. నడుము తిప్పుతూ మరింత హొయలు పోయింది. ఇకపోతే ఈమె డాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఏంటి కర్మ మాకు.. ఇది మాకు అవసరం లేదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news