పూరీ జగన్నాథ్ సినిమాల్లో పెద్దగా సందేశాలు ఇవ్వకుండా, ఎంటర్‌టైన్‌మెంట్‌పైనే ఫోకస్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ నుంచి మెసేజులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ మెసేజులే ఒక్కోసారి బూమరాంగ్ అవుతున్నాయి. పూరీ జగన్నాథ్‌ని విమర్శల్లో పడేస్తున్నాయి. ఇప్పుడు ఫ్లాప్ సినిమాలు-రివ్యూస్ గురించి మాట్లాడిన పూరీని ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
పూరీ జగన్నాథ్ ఫ్లాప్ మూవీస్ అని ఒక పాడ్‌క్యాస్ట్ రిలీజ్ చేశాడు. ఈ రికార్డ్‌లో ఫస్ట్ డే- ఫస్ట్ షోస్ గురించి, రివ్యూస్ గురించి మాట్లాడాడు. ఫ్లాప్ మూవీస్‌ని బ్రతికించండి, ఇండస్ట్రీని కాపాడండి అని లాజిక్కులు మాట్లాడాడు. తప్పుడు రేటింగులు ఇవ్వండని విశ్లేషకులని రిక్వెస్ట్ చేశాడు.
పూరీ జగన్నాథ్ మాటలపై ఫుల్ ఫైర్ అవుతున్నారు జనాలు. మీకు వంద, నూట యాభై రూపాయలు తక్కువ కావొచ్చు. కానీ సినిమా చూసి కష్టాలు మరిచిపోదాం అనుకున్న రోజు కూలీకి అది చాలా ఎక్కువ. వాళ్ల కష్టారిజతాన్ని మంచి సినిమాకే ఖర్చు చెయ్యాలనునకుంటున్నారు. అలాంటి వాళ్లకి డిజాస్టర్ సినిమాని సూపర్ అని చెప్పి మోసం చెయ్యమంటావా.. ఈ తెలివితేటలు ఏదో ఇండస్ట్రీలో చూపించుకోండి.. స్టోరీస్ సరిగ్గా రాసుకొమ్మని, సినిమాలు కరెక్ట్‌గా తియ్యమని దర్శకులకు చెప్పుకోండని విమర్శిస్తున్నారు నెటిజన్లు.