నీకూ – చైతూ కి అదే తేడా అంటూ సమంత పై భారీ ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత గత ఏడాది కారణాలు చెప్పకుండానే విడాకులు తీసుకోవడం జరిగింది . దీంతో అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిందని చెప్పవచ్చు. నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరిద్దరూ ఇలా విడాకులు తీసుకొని విడిపోవడం అందరికీ బాధ కలిగించింది. ఇకపోతే వీరు విడాకులు తీసుకొని సుమారుగా తొమ్మిది నెలలకు పైగానే అవుతున్నా ఇప్పటివరకు సస్పెన్షన్ మాత్రం వీడలేదు. ఇకపోతే విడాకులతో ఈ జంట విడిపోయి తమ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టి ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా మారిపోయారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా తమ విడాకులకు సంబంధించిన విషయాలను తెలియజేయలేదు.

కానీ ఇటీవల బాలీవుడ్లో తన సత్తా చాటడానికి సిద్ధమైన సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనింది. ఈ క్రమంలోనే సమంతను ప్రశ్నిస్తూ మీ భర్త చైతన్య అని కరణ్ ప్రశ్న వేయబోతుండగానే .. సమంత అడ్డు చెప్పి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ భర్త కాదు మాజీ భర్త అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అంతేకాదు తనను.. నాగచైతన్యను ఒకే గదిలో పెడితే అక్కడ కత్తులు కటార్లు లేకుండా జాగ్రత్త పడమని కూడా షాకింగ్కు కామెంట్లు చేయడంతో ప్రతి ఒక్కరు ఈమెపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నాగచైతన్య గురించి అడిగిన ప్రతి సారి కూడా ఆమె తన ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉండడంతో నాగచైతన్య అభిమానులు కూడా సమంత పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

ముఖ్యంగా విడాకుల విషయంలో, సమంత విషయంలో చాలా హుందాగా ప్రవర్తించడమే కాకుండా ఆమె విషయాలన్నింటిని చాలా గోప్యంగా ఉంచిన నాగచైతన్య ఏ రోజు కూడా ఆమె గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇక అంతే కాదు బంగార్రాజు సినిమా ఈవెంట్ లో కూడా నాగచైతన్య – సమంత గురించి ఒక్క మాట కూడా నెగిటివ్గా మాట్లాడకపోవడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. కానీ సమంత ఇలా నాగచైతన్య పై తప్పుడు మాటలు మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా నాగచైతన్య పై పాజిటివ్గా మాట్లాడుతూ.. చైతన్య గురించి సమంత నెగటివ్ గా మాట్లాడుతుండడంపై నీకు చైతన్యకు ఉన్న తేడా అదే అంటూ పెద్ద ఎత్తున ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news