ఈ భాగాల్లో సన్ స్క్రీన్ మర్దన చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు..

-

సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మానికి హాని కలగజేస్తాయి. చర్మా క్యాన్సర్లకి ఇది కారణం కావచ్చు. అందువల్ల సూర్యుడి నుండి వచ్చే హానికర అతినీల లోహిత కిరణాల నుండి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ వాడడం తప్పనిసరి చేసుకోవాలి. ఐతే కొంతమంది సన్ స్క్రీన్ అప్లై చేసుకునే భాగాలను మర్చిపోతుంటారు. శరీరంలోని ఏయే భాగాల్లో సన్ స్క్రీన్ తప్పకుండా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

పెదవులు

చర్మంలోని సున్నిత భాగాల్లో పెదవులు ఒకటి. వీటిని చాలామంది మర్చిపోతుంటారు. దానివల్ల చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉండవచ్చు. మీ పెదవులకు SPF తో పాటు లిప్ బామ్ ఉపయోగించండి.

కనురెప్పలు

కనురెప్పలకు కూడా సన్ స్క్రీన్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాటిపై వృద్ధాప్య ముడతలు, గీతలు తొందరగా ఏర్పడతాయి. కాబట్టి దాన్నుండి రక్షించుకోవడానికి కనురెప్పల మీద సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం తప్పనిసరి.

చెవులు

చెవుల విషయంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. చెవి వెనక భాగాలలో ప్రత్యేకంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి.

చేతులు, కాళ్ళు

కాళ్ళు, చేతులు పూర్తిగా తొడుగులతో కప్పి ఉన్నప్పుడు ఫర్వాలేదు గానీ సాధారణ సమయంలో చేతులు, కాళ్ళకి సన్ స్క్రీన్ తప్పనిసరి. బీచ్ లో నడుస్తున్నట్లయితే అరికాళ్ళకు సన్ బ్లాక్ వేసుకుంటే మరీ మంచిది.

మెడ

మెడ బయటకు కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా సన్ స్క్రీన్ వాడాలి. ముందుభాగంతో పాటు మెడ వెనక భాగంలోప్రత్యేకంగా అప్లై చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version