విటమిన్ సి మరియు జింక్ సప్లిమెంట్స్ ని కలిపి తీసుకోవద్దు… ఎందుకంటే…?

-

నిపుణులు విటమిన్ సి మరియు జింక్ రెండిటినీ కలిపి తీసుకోవద్దని చెబుతున్నారు. ఈ మహమ్మారి సమయం లో అసలు ఈ తప్పు చేయకూడదని నిపుణులు హెచ్చరించారు డాక్టర్స్. విటమిన్ సి మరియు జింక్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోమని దీని కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఒకవేళ కనుక మీరు ఇవి ఉన్న ఆహారం తీసుకోకపోతే అప్పుడు సప్లిమెంట్స్ వేసుకోమంటున్నారు.

కానీ కొన్ని సప్లిమెంట్స్ తీసుకోకూడదు మీకు తెలుసా..? అలానే జింక్ మరియు విటమిన్ సి సప్లిమెంట్స్ రెండింటినీ ఒకసారి తీసుకోవడం చాలా ప్రమాదకరమని చెప్తున్నారు.

జింక్ మరియు విటమిన్ సప్లిమెంట్స్ ఒకేసారి తీసుకోవచ్చా…?

చాలా మంది మల్టిపుల్ విటమిన్స్ మరియు మినిరల్స్ ను కలిపి తీసుకుంటున్నారు. ఎక్కువ సప్లిమెంట్ వేసుకునేటప్పుడు కొన్ని సప్లిమెంట్స్ ని ఒకేసారి కలిపి తీసుకుంటున్నారు అయితే అది మంచిది కాదని పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ఏదైనా సప్లిమెంట్ ని తీసుకునేటప్పుడు అది లోపలికి వెళ్లి అది పనిచేయడం మొదలు పెడుతుంది.

ఒకవేళ కనుక రెండు సప్లిమెంట్స్ ని ఒకసారి తీసుకుంటే అవి వృధా అయిపోతాయి అని నిపుణులు అంటున్నారు. అదే విధంగా ఇవి ఆరోగ్యానికి తీవ్ర సమస్యలు తీసుకొస్తాయని చెబుతున్నారు. ఎప్పుడైనా మీరు విటమిన్ సి మరియు జింక్ తీసుకునేటప్పుడు ఒకేసారి తీసుకోవద్దు. వేర్వేరు సమయాల్లో తీసుకోండి.

కొన్ని ఓటిసి మెడిసిన్స్ ఉన్నాయి అవి తీసుకునేటప్పుడు సరైన మోతాదు ఉండేవి తీసుకోండి డాక్టర్ సలహా పాటించి తీసుకోవడం మంచిది. కొన్ని కొన్ని విటమిన్ సి టాబ్లెట్స్ లో కొద్దిగా జింక్ ఉంటుంది. వాటిని నమలాలి. ఒకవేళ మీ డాక్టర్ వాటిని ప్రిఫర్ చేస్తే మీరు వాటిని తీసుకోవచ్చు.

ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది…?

సప్లిమెంట్ డోస్ ఎక్కువగా అంటే వాంతులు, కడుపు నొప్పి, డయేరియా, తలనొప్పి, యూరిన్ లో బ్లడ్ పడడం, హార్ట్ రేట్ అటు ఇటు అవ్వడం, రుతుక్రమం పై ప్రభావం చూపించడం, మజిల్స్ వీక్ అయిపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ ఇటువంటి లక్షణాలు మీకు కనబడినట్టు అయితే మీరు మీ డాక్టర్ ను సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Latest news