కరోనా వైరస్ తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి చిన్న నుంచి పెద్ద వరకు ఎవరిని కూడా వదలడం లేదు. తాజాగా లండన్ లో అప్పుడే పుట్టిన ఒక శిశువు లో పుట్టిన కొన్ని గంటల్లోనే కరోనా సోకడం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. లండన్ నగరంలోని నార్త్ మిడిలెక్స్ ఆసుపత్రిలో పుట్టిన శిశువుకు పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే శిశువు తల్లి గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతుండడం తో నార్త్‌మిడిలెక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని సమాచారం. అయితే ప్రసవం జరిగిన వెంటనే కొన్ని గంటల వ్యవధిలో శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనావైరస్ ఉన్నట్లు బయటపడింది. అయితే ఈ వైరస్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకు సోకిందా, లేక పుట్టిన వెంటనే సోకిందా అన్న కోణంలో వైద్యులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తల్లి,బిడ్డ ఇద్దరినీ కుల వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
శిశువుకు కరోనా సోకడం విషయం పక్కన పెడితే ఈ చిన్నారి ఒక రికార్డ్ కూడా నెలకొల్పింది. ప్రపంచంలో కరోనా వైరస్ సోకినా అతి చిన్న వయస్కురాలి గా ఆ నవజాత శిశువు నిలిచింది. శనివారం యూకేలో కరోనా సోకిన కేసుల సంఖ్య 798కి చేరగా, 10 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ మహమ్మారి రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉంది. ఇప్పటికే ఈ కరోనా కు భయపడి అమెరికా వీసా ప్రాసెస్ ను కూడా నిలిపివేగా, భారత్ లో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడం తో విదేశీ ప్రయాణాలపై నిషేధం కూడా test విధించింది.