మీడియాకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ , అతి చేస్తే ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తా….!

-

విదేశాల నుంచి వస్తున్న వారితోనే కరోనా వైరస్ వస్తుందని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణా గడ్డ మీద అసలు కరోనా లేదని ఎవరికి తెలంగాణాలో సోకలేదని ఆయన అన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా మంత్రి వర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి గురించి చర్చించారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు.

దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశం వివరాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మీడియాకు కెసిఆర్ కీలక హెచ్చరికలు చేసారు. అసలు కరోనా గురించి ఆరోగ్య శాఖను సంప్రదించకుండా అధికారిక ప్రకటన రాకుండా ప్రసారం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో కొందరు అతి గాళ్ళు లేని పోనీ ప్రచారాలు అన్నీ చేస్తున్నారని, వాళ్ళు ఆపకపోతే మాత్రం… ప్రభుత్వం అంటే ఏంటో చట్టం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు కెసిఆర్. ఎవరిని అంత తేలికగా వదిలేది లేదని స్పష్టం చేసారు.

పెళ్లిళ్లకు ముందే అనుమతి తీసుకున్న వారు ఎలాగూ లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి పెళ్లి ఆపలేమని, కాని వంద మంది అమ్మాయి తరుపు వాళ్ళు వంద మంది అబ్బాయి తరుపు వాళ్ళు ఉండి, 200 మందితో కార్యక్రమం ముగిస్తే మీకే మంచిది అని హెచ్చరించారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని హెచ్చరించారు. రిస్క్ చేయవద్దని ప్రజలకు సూచించారు. ఆ తర్వాత పరిస్థితిని పట్టి సడలించాలా కొనసాగించాలా అనేది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మరోసారి దీనిపై చర్చించి అప్పుడు చెప్తామని అన్నారు.

నిత్యావసర సరుకులు కొనుక్కునే సమయంలో ఎక్కువ మంది వద్దని వెంటనే ఇళ్ళకు వెళ్లాలని, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కెసిఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం అని ఏ ఇబ్బంది లేదని అన్నారు. వారం రోజుల పాటు అన్ని క్రీడా కార్యక్రమాలు రద్దు చేస్తున్నామని, దీనిపై మరోసారి సమీక్ష చేసి అప్పుడు చెప్తామని అన్నారు. మాస్క్ లు కొని డబ్బులు వృధా చేసుకోవద్దని, తెలంగాణాలో కరోనా వైరస్ లేదని, ఒకవేళ మాస్క్ లు ఎక్కువ ధరకు అమ్మితే మాత్రం చర్యలు ఉంటాయని, మీడియా వాళ్ళు తమకు అడ్రస్ లు ఇవ్వాలని కోరారు.

ఈ సమావేశంలో మీడియాకు ఎక్కువ హెచ్చరికలు చేసారు కేసీఆర్. మీడియా ను చూసి ప్రజలు ఎక్కువ కంగారు పడుతున్నారని, కాబట్టి మీడియా హద్దుల్లో ఉంటే మంచిది అని హెచ్చరించారు. అనుమానితుడు బాధితుడు కాదని అన్నారు. అనుమానితులను బాధితులుగా చూపిస్తే మీడియా ను బాధ్యులను చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని, విదేశాల నుంచి వచ్చే వారికి భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేసిందని, కరోనా ప్రభావం కేవలం ఏడు దేశాలకు మాత్రమే ఎక్కువగా ఉందని అన్నారు. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఇరాన్, దక్షిణకొరియా, స్పెయిన్, బ్రెజిల్ దేశాలకు మాత్రమే ఎక్కువగా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news