ప్రతిష్టాత్మక టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) సీఈఓగా గేదెల సురేశ్ కుమార్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సురేశ్ కుమార్ ప్రస్తుతం విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ పై ఆయన రాష్ట్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు. త్వరలోనే ఎస్వీబీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు చెబుతున్నారు.
నిజానికి అయోధ్య భూమి పూజ రోజున దేశంలోని అన్ని ఛానెల్స్ ఆ కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చాయి. కానీ భక్తి ఛానెల్ అయి ఉండీ, దానిని లైవ్ ఇవ్వక పోవడాన్ని బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. విష్ణు వర్ధన్ రెడ్డి వంటి వారు దీనిని హైలైట్ చేశారు. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈయనను నియమించి ఉండచ్చని భావిస్తున్నారు. ఇక గతంలో ఉన్న సీఈఓ మీద అనేక రకాల ఆరోపణలు కూడా వినిపించాయి. నటుడు పృథ్వి రాజ్ ఎపిసోడ్ లో కూడా పృథ్వి సీఈఓనే కావాలని తనని ఇరికిన్చినట్టుగా ఆరోపణలు చేశారు.