ఎస్సీ, ఎస్టీలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని జగన్ సర్కార్ గతంలోనే హామీ ఇచ్చింది. వారు వినియోగించిన విద్యుత్ కు డిస్కంలు ఇప్పటి వరకు బిల్లలు వసూలు చేయట్లేదు కానీ.. ఇకపై ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లో కాకుండా బయట ఉండేవారికి ఉచిత విద్యుత్ వర్తించదంటూ ప్రభుత్వం పేర్కొంది.
దీనికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా వర్గాల కనెక్షన్ల లెక్కలు తీస్తున్నాయి. కాలనీల వెలుపల ఉన్నవారి నుంచి ఇప్పటి వరకు పొందిన రాయితీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడానికి సిద్దపడతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 17.05 లక్షల ఎస్సీ, 5.10 లక్షల ఎస్టీ కనెక్షన్లు ఉండగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ పొందుతున్న ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు వెళ్లి.. వారి వివరాలను డిస్కంలు సేకరిస్తున్నాయి. వచ్చే నెల నుంచే ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లో కాకుండా బయట ఉండేవారి నుంచి ఛార్జీలు వసూలు చేయనుంది.