డిగ్రీ, పీజీ చదువుతున్న వారికి శుభవార్త.. ఇకపై ఎన్ని ఎంట్రీలయినా ఇవ్వచ్చు

-

డిగ్రీ, పీజీ చదివే వారికి యూజీసీ శుభవార్త తెలిపింది. ఇకపై మూడు, నాలుగు సంవత్సరాలు క్రమం తప్పకుండా విద్యాలయాలకు వెళ్ళాల్సిన అవకాశాన్ని తప్పించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేలా, ఎలా కావాలంటే అలా చదువుకునేలా మార్పులు తీసుకువచ్చింది. మల్టీపుల్ ఎంట్రీ, ఎక్సిట్ విధానాలను ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం డిగ్రీ, పీజీ చేస్తున్నవారు ఎప్పుడు కావాలంటే అప్పుడు విద్యాలయాలకు వెళ్ళవచ్చు. కావాల్సినపుడు పరీక్షలు రాసుకోవచ్చు.

నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఇది అమలు కానుందని యూజీసీ తెలిపింది. ఐతే ప్రస్తుతం ఈ విద్యా విధానం కేవలం కేంద్ర పరిధిలో ఉన్న విశ్వ విద్యాలయాలకే వర్తిస్తుందని, రాష్ట్ర పరిధిలో ఉన్న విశ్వ విద్యాలయాలు, నిర్ణయం తీసుకొవాల్సిన అవసరం ఉందని, ఆ నిర్ణయం వారికే వదిలేసామని యూజీసీ ప్రకటించింది. ఈ విధానంతో చాలామంది విద్యార్థులకు మంచి అవకాశం దొరికనట్లుగా ఉంటుంది. అటు పని చేసుకుంతూ చదవాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశంగా ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news