గుడ్ న్యూస్.. యూపీఐ యాప్‌ లో కొత్త ఫీచర్..!

-

ఈ మధ్య ప్రతీ ఒక్కరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ఏ చేస్తున్నారు. పైగా ట్రాన్సక్షన్స్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఈ మధ్య ప్రతీ ఒక్కరు యూపీఐని ఉపయోగించి లావాదేవీలు చేస్తున్నారు. డిసెంబర్‌ మానిటరీ పాలసీ సమీక్షను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం నిర్వహించింది. యూపీఐ పేమెంట్‌ సిస్టమ్‌లో సింగిల్‌ బ్లాక్‌, మల్టిపుల్‌ డెబిట్‌ వంటి ఫీచర్స్ ని తీసుకు వస్తున్నట్టు చెప్పింది.

ఒకవేళ కనుక ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే అది మనకు ఎంతో ప్లస్ అవుతుంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల లో షాపింగ్ చేయడం లేదా షేర్స్ ని కొనడం, సింగిల్ డెబిట్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నారు. దీనితో ఈ సేవలకు ఆటోపే సదుపాయాన్ని పొందుచు. అంటే చెల్లింపు స్వయంగా పూర్తవుతుంది. అయితే ఇప్పుడు సర్వీస్ లిమిట్ ని పెంచారు. సింగిల్-బ్లాక్-అండ్-మల్టిపుల్-డెబిట్ ఫీచర్‌తో ఇప్పుడెన్నో ఫీచర్స్ కోసం యూపీఐ ద్వారా మీరు అకౌంట్ లో ఒకేసారి బ్లాక్ చేసి.. తర్వాత వేరు చేయవచ్చు. తగ్గింపు సౌకర్యం ఉంటుంది.

కస్టమర్ అవసరమైనప్పుడు డబ్బును తీసివేయడం కోసం అకౌంట్ లో ఒకే సారి నిధులను బ్లాక్ చేసేసి సంబంధిత ఎంటిటీకి చెల్లింపును పరిష్కరించవచ్చు. ఈ ప్రాసెస్ తో ఈ-కామర్స్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడికి పే చెయ్యడం ఈజీ అవుతుంది. యూపీఐ సింగిల్ బ్లాక్, సింగిల్ డెబిట్ ఫీచర్ తో ఇప్పుడు 70 లక్షలకు పైగా ఆటో చెల్లింపులు అవుతున్నాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తామని ఆర్‌బీఐ అంది. అంతే కాక భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ పరిధిని కూడా పెంచచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news