టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ ఎంట్రీ.. భలే ఉందే..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు ఎప్పుడూ వస్తూ ఉంటారు అభిమానులను ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీరోయిన్లు అదృష్టం బాగా వచ్చి ఇక అభిమానులను ఆకర్షించింది మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన వారు కొద్ది మంది అయితే.. కొంతమంది మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అవుతుంటారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు త్వరలో మరో కొత్త హీరోయిన్ టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మలయాళంలో మంచి టాక్ తెచ్చుకుని ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన కప్పేల అనే సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రస్తుతం సిద్ధమవుతోంది. నవీన్ చంద్ర విశ్వక్ సేన్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనికా సురేంద్ర టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అనికా.

Read more RELATED
Recommended to you

Latest news