డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌తో వ‌స్తున్న నూత‌న ఐఫోన్లు..? ఈ నెల 12నే విడుద‌ల‌..!

-

యాపిల్ ఐఫోన్‌.. దీని గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. కొంద‌రు ఈ ఫోన్ ను ప్రెస్టీజ్ కోసం కొని వాడుతుంటారు. ఇక కొంద‌రు ఆ ఫోన్ల‌లో ఉండే సెక్యూరిటీ, ఇత‌ర ఫీచ‌ర్లు న‌చ్చి ఐఫోన్ల‌ను కొంటుంటారు. అయితే ఎవ‌రు ఏమ‌న్నా ఎలా అయినా ఐఫోన్ల‌కు మాత్రం ఏ ఫోన్లు సాటి రావ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక వినియోగ‌దారుల అభిరుచుల‌కు అనుగుణంగా యాపిల్ కూడా ప్ర‌తి ఏటా కొత్త ఐఫోన్ల‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే ఈ సారి కూడా నూత‌న ఐఫోన్ల‌ను విడుద‌ల చేసేందుకు యాపిల్ రంగం సిద్ధం చేసింది.

ఈ నెల 12వ తేదీన యాపిల్ పార్క్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో గ్యాదర్ రౌండ్ పేరిట యాపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అందులో నూతన ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతోపాటు యాపిల్ ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో యాపిల్ మూడు నూతన ఐఫోన్లను విడుద‌ల చేయ‌నుంది. అవి ఐఫోన్ X కు సీక్వెల్‌గా ఐఫోన్ X ప్లస్, X ఎస్ పేరిట రానున్న‌ట్లు తెలిసింది. ఈ మూడు ఫోన్ల‌లో ఒక ఫోన్ డిస్‌ప్లే 6.1 ఇంచ్ ఎల్‌సీడీ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, మ‌రో రెండు ఫోన్ల డిస్‌ప్లేలు వ‌రుస‌గా 5.8 ఇంచ్ ఓలెడ్‌, 6.5 ఇంచ్ ఓలెడ్ గా ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఫోన్లు గ‌తంలో వ‌చ్చిన ఐఫోన్ X ను పోలి ఉంటాయ‌ట‌. వీటిల్లో ఐఓఎస్ 12ను అందిస్తారు. ఈ ఓఎస్ ను ఈ ఫోన్ల‌తోపాటే విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి కొత్త ఐఫోన్ మోడ‌ల్స్ 512 జీబీ స్టోరేజ్‌లో విడుద‌ల‌వుతాయ‌ని స‌మాచారం. అలాగే 6.5, 6.1 ఇంచ్ మోడ‌ల్ ఐఫోన్ల‌లో డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్ ఉంటుంద‌ట‌. ఈ ఐఫోన్ల ప్రారంభ ధ‌ర 699 డాల‌ర్లుగా, టాప్ మోడ‌ల్ ధ‌ర 999 డాల‌ర్లుగా ఉంటుంద‌ట‌. ఇక ఆ ఈవెంట్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 4 స్మార్ట్‌వాచ్‌లను, నూతన ఐప్యాడ్లను, మాక్‌బుక్‌లను కూడా యాపిల్ విడుద‌ల చేస్తుంద‌ట‌. మ‌రి కొత్త ఐపోన్ల కోసం రెడీగా ఉండండిక‌..!

Read more RELATED
Recommended to you

Latest news