కొత్త పార్లమెంట్ భవనం..సెంట్రల్ విస్టా ప్రత్యేకతలు ఇవే !

-

ఈరోజు కొత్త పార్లమెంట్ భావనానికి మోడీ శంఖుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. కొత్త పార్లమెంట్ భవనానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేటు వరకు 3 కిలోమీటర్ల దూరం వరకు, పచ్చదనానికి విఘాతం కలుగకుండా, “రాజపధ్” కు ఇరువైపులా ఉన్న శాస్త్రి భవన్, కృషి భవన్, రైలు భవన్, ఉద్యోగ భవన్, నిర్మాణ భవన్, వాయుసేన భవన్ లను పడగొట్టి, సర్వహంగులతో ఒక్కొక్కటి 8 అంతస్తులుండే 10 భవనాలను నిర్మించేందుకు రూపకల్పన చేశారు. అయితే, 8 అంతస్తులుండే ఈ భవనాలు, ఇండియా గేట్ కంటే తక్కువ ఎత్తులోనే ఉండేవిధంగా డిజైన్ చేశారు.

మొత్తం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం వలన, సమయం వృధా కాకుండా, ఖర్చును కూడా బాగా తగ్గించవచ్చని,  వనరులను మరింత సమర్ధవంతంగా వినియోగించవచ్చన్నది ప్రభుత్వం ఆలోచన. దేశ రాజధాని లో ప్రతి ఏడాది ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం అద్దెలకింద1000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. రాజధానిలో వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒక్కచోటకు తీసుకురావాలన్నది మోడి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. నగరంలో వివిధ శాఖలు, విభాగాలలో మొత్తం 35 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వారందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసే విధంగా ఈ భవనాలను రూపొందిస్తున్నారు. ఈ కొత్త భవనాల వల్ల ఇండియా గేట్ పరిసర ప్రాంతాలలో గతంలో కంటే అదనంగా ఐదున్నర ఎకరాలలో పచ్చదనం పెరగేవిధంగా ప్లాన్ చేశారు. ఇక ఈ భవనాలకు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లేందుకు  మెట్రో రైలు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news