బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భారత్ బంద్ కి మద్దతు ఇచ్చిన .. బంద్ సక్సెస్ కాలేదని ఇక్కడి ప్రభుత్వం రైతు విధానాలపై ప్రజల మధ్య చర్చకు బీజేపీ సిద్ధం అవుతోందని ఆయన అన్నారు. మీరు ఫాక్ట్ సీట్ తీసుకొస్తే మేము ఛార్జ్ సీట్ తెస్తామని ఆయన అన్నారు. తెరాస రైతాంగం విషయం లో పూర్తిగా విఫలం అయింది.. విజన్ లేదు, అవినీతి పెరిగింది, సమగ్ర పాలసీలు లేవని ఆయన అన్నారు.
తెలంగాణ లో 2 పశువధ శాలలు ఉన్నాయి.. ఇంకోటి రాబోతుంది.. వీటి వల్ల పశు సంపద తగ్గిపోతోందని పేర్కొన్న ఆయన డీజీపీ, పోలీస్ కమిషనర్ లు అండర్ స్కానర్, మీరు ప్రభుత్వ మేనిఫెస్టో అమలు చేయడానికి లేదు ముందే హెచ్చరిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణలో అత్యధికంగా పండే పంట పత్తి, వరి కానీ సీఎం బెదిరించి ఈ రెండు పంటలు వేయించాడని ఈ రెండు పంటలు కేంద్రమే కొంటుంది… ఈ ప్రభుత్వం కొనాల్సిన అవసరం లేదని ఉద్దేశ్యంతో వేయించాడని అన్నారు. ఇతర పంటలను 18 శాతం కి తీసుకొచ్చాడని ఇదే పద్దతి కొనసాగితే రైతు ఆత్మహత్యలు తప్పవని అన్నారు. కళ్ళు మూసి తెరిచే లోపు అబద్ధాలు చెప్పే ట్రైనింగ్ టీఆర్ఎస్ నేతలకి ఉందని ఆయన అన్నారు.