నేటి నుండి కొత్త నిబంధనలు… వినియోగదారులూ చూసుకోండి..!

-

ప్రతీ నెలా లాగే ఈసారి కూడా కొన్ని మార్పులు వచ్చాయి. తప్పక వీటిని వినియోగదారులు గమనించాలి. లేదంటే అనవసరంగా సమస్యలు కలగొచ్చు. నవంబర్ అయ్యి ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది. దీనితో ప్రతీ నెలా లానే ఇప్పుడు కూడా కొన్ని అంశాల్లో మార్పులు వచ్చాయి. అయితే మరి ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి…? అనేదే ఇప్పుడు చూద్దాం. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

లైఫ్ సెర్టిఫికెట్ లో మార్పులు:

మీకు పెన్షన్ వస్తోందా..? అయితే పక్కా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతీ సంవత్సరం పెన్షన్ ని పొందేవాళ్ళు లైఫ్ సెర్టిఫికెట్ ని సమర్పించాల్సి వుంది. ఈ సర్టిఫికేట్‌ను 30 నవంబర్ 2022లోపు సబ్మిట్ చెయ్యాల్సి వుంది. లేదంటే చిక్కుల్లో పడాలి.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏటీఎం రూల్స్ లో మార్పు:

అలానే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏటీఎం కి సంబంధించి కూడా కొత్త రూల్స్ వచ్చాయి. మోసాలు ఏమి జరగకూడదు అని ఈ రూల్ ని తీసుకు వచ్చారు. వీళ్ళు మెషీన్‌లో ఏటీఎం కార్డును పెట్టక రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వసుంది. దాన్ని ఎంటర్ చేయాల్సి వుంది. అప్పుడే డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలి. డిసెంబర్‌ 1 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.

రైలు టైమ్‌టేబుల్‌ లో మార్పు:

శీతాకాలంలో రైళ్ల షెడ్యూల్‌ను మారుస్తుంది రైల్వే శాఖ . డిసెంబర్ 1 నుంచి ఈ షెడ్యూల్ అమలులోకి రానుంది.

గ్యాస్ సిలండర్ ధరలు:

సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను ప్రతీ నెలా కూడా మారుస్తూ వుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటి రోజు లేదా మొదటి వారంలో ఈ ధరల్ని మారుస్తారు కనుక ఈసారి కూడా మార్పు ఉంటుంది. ఈసారి మాత్రం ఈ ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. కనుక చూసుకోండి. వాణిజ్య సిలిండర్‌పై కేంద్రం ధరలను తగ్గించేలానే కనపడుతోంది. మరి ఏ చేస్తుంది అనేది చూడాల్సి వుంది. ఇంకా ఎలాంటి మార్పు అయితే చేయలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news