మీకు దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతా వుందా..? అయితే మీరు తప్పక దీని కోసం తెలుసుకోవాలి. తాజాగా దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం వుంది.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. చార్జీలను పెంచుతూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ చార్జీలను పెంచేసింది. ఇది ఇలా ఉంటే ఉచిత లావాదేవీల పరిమితి దాటితే మాత్రం ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.21 వరకు చెల్లించాలి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా చార్జీలు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే బ్యాంక్ కస్టమర్లు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటే.. ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.21 చార్జీ చెల్లించుకోవాలి.
హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం నుంచి నెలలో ఐదు సార్లు చార్జీలు లేకుండా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తరవాత మాత్రం ప్రతి క్యాష్ విత్‌డ్రాయెల్‌కు రూ.21 కట్ అవుతుంది. అయితే నాన్ క్యాష్ విత్‌డ్రాయెల్ ట్రాన్సాక్షన్లకు చార్జీలు ఉండవు.