క్రిమినల్ శిక్షల్లో భారీ మార్పులు … ఇక రేప్ చేయాలంటే గుండెల్లో దడ పుట్టాలి !

-

నేడు సమాజంలో మహిళకు రక్షణ కరువైంది .. వయసుతో సంబంధం లేకుండా మహిళ అయితే చాలు అన్నటులుగా విచక్షణారహితంగా, విచ్చలవిడిగా మానభంగాలు జరుగుతున్నాయి. చట్టంలో ఎన్ని కఠినమైన మార్పులు తీసుకువస్తున్న భయమన్నది లేకుండా మృగాలు పేట్రేగిపోతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా క్రిమినల్ కేసుల్లో కొన్ని భారీ మార్పులు చేసింది. ఇందులో ఐపీసీ , సీఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ లకు బదులుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య బిల్లులను మార్చింది. కాగా ఈ మూడు బిల్లులతో కీలకమైన విషయాలు చూస్తే,

  • ఇకపై మైనర్ బాలికలను అత్యాచారం చేస్తే ఉరిశిక్షను అమలు చేయనున్నారు.

* గ్యాంగ్ రేప్ కు కనుక పాల్పడితే వారికి 20 ఏళ్ళు పాటి జైలు శిక్ష విధించనున్నారు.

* మూక దాడులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష వేయనున్నారు.

ఈ శిక్షలను చూశాక ఇకపై అత్యాచారం చేయాలంటేనే గుండెల్లో చావు భయం మొదలవ్వాలి.

ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఉండే కేసులలో ఖచ్చితంగా ఫోరెన్సిక్ సాక్ష్యాలను కోర్ట్ కు సమ్పరించాల్సి ఉంటుంది. ఇక ఎక్కడి నుండి అయినా E FIR ను నమోదు చేయడానికి అవకాశాన్ని కల్పించనున్నారు. ఇక సెర్చ్ ఆపరేషన్ చేయాలంటే వారంట్ ఉండాల్సిందే అంటూ చెప్పడంతో పాటుగా , సెర్చ్ చేసే సమయంలో వీడియోగ్రఫీ కంపల్సరీ చేసింది.

రానున్న కాలంలో ఇకపై పొరపాట్లు జరగకుండా చేయడానికి FIR నుండి ఛార్జ్ షీట్ వరకు అన్నీ కూడా డిజిటలైజ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news