ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులంతా కేసీఆర్ పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలో ప్లాన్ చేసి రెడీగా ఉన్నారు. పలువురు ముఖ్యంత్రికి అదిరిపోయే కానుకలు కూడా సిద్ధం ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో వరంలగ్ బీఆర్ఎస్ నాయకులు కాస్త వినూత్నంగా ఆలోచించారు. సీఎం బర్త్ డే స్పెషల్గా వరంగల్ నగరంలో ఓ సచివాలయాన్నే నిర్మిస్తున్నారు. కొత్త సచివాలయం పూర్తయింది కదా.. మరొకటి నిర్మిస్తున్నారేంటి అనుకుంటున్నారా.
ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని బుధవారం నుంచి మూడు రోజులుపాటు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఓ వినూత్న కార్యక్రమానికి పూనుకున్నారు. అజంజాహి మైదానంలో సుమారు రూ.30 లక్షలు వెచ్చించి ఇలా నూతన సచివాలయ నమూనాతో సెట్టింగ్ ఏర్పాటు చేయిస్తున్నారు. శివరాత్రికి ఇక్కడే పూజలు చేసేలా మరో రూ.30 లక్షలతో భారీ శివలింగం, భక్తుల జాగారం కోసం ఏర్పాట్లు చేపట్టారు.