కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ఆలోచన ఉన్నవారికి ఇది ఒక శుభవార్త. సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది స్టాండర్డ్ పాలసీ. ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ ఈ పాలసీని అందుబాటులో ఉంచాలని ఐఆర్‌డీఏఐ నిర్దేశించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి ఒక తీపికబురు చెప్పింది. ఇకమీదట అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావాలని ఆర్‌డీఏఐ వాళ్ళని ఆదేశించింది. 2021 జనవరి1 నాటికి సరల్ జీవన్ బీమా పేరుతో స్టాండర్డ్ పాలసీ తీసుకురావాలని గడువు నిర్దేశించింది.
ఇకపై అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు సింపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కస్టమర్లకు అందుబాటులో ఉంచాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. 18 నుంచి 65 ఏళ్ల వయసులో ఉన్న వారందరు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ 4 ఏళ్ల నుంచి 40 ఏళ్ల కాల పరిమితితో పాలసీదారుడు పొందవచ్చు. ఇది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, అంటే ఒకవేళ పాలసీదారుడు ఏదైనా కారణం చేత మరణిస్తే పాలసీ డబ్బులు నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు. పాలసీదారుడు పాలసీ టర్మ్‌లో జీవించి ఉంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి డబ్బులు అందవు. ఇందువల్లే ఈ పాలసీలకు ప్రీమియం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఒకవేళ ఊహించని పరిస్థితుల్లో పాలసీదారుడు పాలసీ టర్మ్ లో చనిపోతే, అంటే ఇంట్లో సంపాదించే వారు మరణిస్తే అప్పుడు పాలసీదారుడు కుటుంబ సబ్యులకు డబ్బులు అందుతాయి.
పాలసీదారుడు రూ.5 లక్షల నుండి రూ. 25 లక్షల బీమా మొత్తం వరకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. పాలసీదారుడు తీసుకున్న పాలసీకి రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లించొచ్చు, లేదా 5 నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ప్రీమియం కట్టొచ్చు. లేదంటే ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించొచ్చు. ఈ పాలసీకి 45 రోజుల వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే కస్టమర్ పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వతనే పాలసీ వర్తిస్తుంది.