సరి కొత్త మోసం.. వాళ్ళే లోన్ ఇస్తారు.. వాళ్ళే డబ్బులు నొక్కేస్తారు..!

-

లాక్​డౌన్ తర్వాత సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు కనీసం ఇరవై నుంచి ముప్పై వరకు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. రోజు వారీ వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా… ఆన్​లైన్​ మోసాలేనని పోలీసులు చెబుతున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు అమ్ముతామని ఓఎల్ఎక్స్ ద్వారా, బ్యాంక్ అదికారులమంటూ ఓటీపీలు పంపించి దోచేస్తున్నవారు, విలువైన బహుమతులంటూ దోచుకుంటున్న వారూ ఉన్నారు. ఇప్పుడు కొత్త మోసాలకు తెర తీశారు. ఫోన్​ చేసి లోన్ కావాలా అని అడుగుతారు. అవసరం లేదని చెప్పినా… మొహమాటపెట్టి పెద్ద మొత్తంలో మంజూరు చేయిస్తున్నారు. ఆ డబ్బులు ఖాతాలో జమ చేయిస్తారు… ఆ తర్వాత వాళ్లే దోచుకుంటున్నారు. ఈ తరహా గత నెల రోజుల్లో దాదాపు ఆరు నమోదయ్యాయి.

CyBer crime
Cyber crime

చిక్కడపల్లికి చెందిన సంగీతకు కాల్​ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం… మీకు లోన్ కావాలా… అని అడిగారు. ఆమె వద్దన్నా… లోన్ తీసుకోవాల్సిందేనని పట్టుబట్టి రూ.4.70 లక్షలు మంజూరు చేయించారు. ఆ మొత్తాన్ని సంగీత ఖాతాలో జమ చేయించారు. మీ ఖాతాలో డబ్బు జమైనట్టు ఎస్​ఎంఎస్​ వచ్చిన కొద్ది క్షణాల్లోనే… రూ.5 లక్షలు విత్​డ్రా అయినట్టు మరో సందేశం వచ్చింది. వెంటనే బ్యాంక్​లో సంప్రదించగా… ఖాతాలో డబ్బు జమ, విత్ డ్రా కూడా అయ్యాయని చెప్పారు. మోసపోయానని తెలుసుకొని సంగీత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news