కరోనా నేపథ్యంలో ప్రస్తుతం జనాలందరూ విధిగా మాస్క్‌లను ధరిస్తున్నారు. మాస్క్‌లను ధరించడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందన్న నిపుణుల సూచన మేరకు వారు మాస్కులను ధరించడం తమ దినచర్యలో భాగం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కంపెనీలు కూడా భిన్న రకాల మాస్కులను తయారు చేసి జనాలకు అందిస్తున్నాయి. ఇక తాజాగా ఓ కంపెనీ నూతన తరహా ఎన్95 మాస్క్‌ను తయారు చేసి లాంచ్ చేసింది. దాని సహాయంతో వినియోగదారులు కాల్స్ మాట్లాడుకోవడమే కాదు, సాంగ్స్ కూడా వినవచ్చు.
ది హబుల్ కనెక్టెడ్ అనే ఓ కంపెనీ మాస్క్‌ఫోన్ పేరిట ఓ నూతన తరహా ఎన్95 మాస్క్‌ను తయారు చేసింది. దీంట్లో ఇన్‌బిల్ట్ ఇయర్‌ఫోన్స్, మైక్రోఫోన్ ఉంటాయి. అందువల్ల ఈ మాస్క్‌ను ధరించాక ఆ ఇయర్ ఫోన్స్‌ను చెవులకు పెట్టుకోవచ్చు. ఆ ఇయర్‌ఫోన్స్ యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అవుతాయి. దీంతో ఫోన్‌లోని పాటలను వినవచ్చు. అలాగే ఫోన్ కు వచ్చే కాల్స్ ను రిసీవ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఈ మాస్క్ చాలా అనువుగా ఉంటుంది.
ఇక ఈ మాస్క్ లో పీఎం 2.5, ఎన్95/ఎఫ్ఎఫ్‌పి2 ఫిల్టర్లు ఉంటాయి. అందువల్ల కరోనా నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. అందువల్ల ఈ మాస్క్‌ను వాష్ చేసి మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి ఈ మాస్క్‌కు ఫుల్ చార్జింగ్ పెడితే దాంతో 12 గంటల వరకు ఇయర్‌ఫోన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక ఫోన్ లో యాప్‌కు కనెక్ట్ అయి ఉంటే ఈ మాస్క్ ధరించి ఉన్నా మనం మాట్లాడేది అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుంది. అందుకు గాను మాస్క్‌లో ఉన్న మైక్రోఫోన్ ఉపయోగపడుతుంది. అది మన వాయిస్‌ను అవతలి వారికి పెద్దదిగా చేసి వినిపిస్తుంది.
ఈ మాస్క్ ధర 49 డాలర్లు (దాదాపుగా రూ.3600)గా ఉంది. ఇది ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇండియాలో త్వరలో లభ్యం అయ్యే అవకాశం ఉంది.