గుడ్ న్యూస్‌: త‌గ్గిన బంగారం ధ‌ర

-

కొంత‌కాలంగా చుక్క‌ల‌ను తాకుతున్న బంగారం ధ‌ర కాస్త త‌గ్గింది. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 173 క్షీణించి రూ. 49,335 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 1,850 పతనమై రూ. 56,638 వద్ద కదులుతోంది. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్‌ ఇండెక్స్‌ రెండు నెలల గరిష్టానికి (94.4) బలపడటం వంటి కార‌ణాల‌తో పసిడి, వెండి ధరల‌ను దెబ్బతీస్తున్నాయి. దీనికితోడు రెండు నెలల క్రితం సరికొత్త గరిష్టాలను తాకిన తదుపరి కన్సాలిడేషన్‌ బాటలో సాగిన బంగారం, వెండి ధరలు ఇటీవల దిద్దుబాటు (కరెక్షన్‌)కు లోనవుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ముందు రోజు విదేశీ మార్కెట్లో 2 శాతం పతనంకావడం ద్వారా రెండు నెలల కనిష్టాన్ని తాకిన బంగారం, వెండి ధరలు మరోసారి డీలా పడ్డాయి.

ఈ ఏడాది జూలై 17న బంగారం ధరల ఔన్స్‌ 1,795 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం పసిడి ధరలో కరెక్షన్‌ కారణంగా బేర్‌ ఆపరేటర్లు ఈ స్థాయి వరకూ ధరలను పడగొట్టేందుకు ప్రయత్నించవచ్చని బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. 1800 డాలర్ల దిగువకు ధరలు జారితే.. పసిడి మరింత బలహీనపడేందుకు వీలుంటుంద‌ని వారు అంచనా వేస్తున్నారు. అయితే కొవిడ్‌-19 మరింత విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి విఘాతం కలగవచ్చని.. మళ్లీ లాక్‌డవున్‌ల కాలంవస్తే పలు దేశాల జీడీపీలు మాంద్య పరిస్థితుల్లో చిక్కుకోవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు బంగారానికి డిమాండ్‌ పెంచగలవని వారు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news