కరోనా కొత్త రూపం.. లండన్ లో లాక్డౌన్.. విమానాలు బంద్..

-

బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త రూపు దాల్చుకుంది. వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో అక్కడ ఆరోగ్య మంత్రి కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. బ్రిటన్ ప్రధాని, బోరిస్ జాన్సన్ లండన్ తో పాటు ఆగ్నేయ ఇంగ్లండ్ మొదలగు ప్రాంతాల్లోలాక్డౌన్ విధించారు. క్రిస్ మస్ దగ్గర పడుతున్న క్రమంలో కరోనా కొత్త రూపం మరింత విజృంభిస్తుందన్న ఆలోచనతో లాక్డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుండి వచ్చే విమానాలు గానీ, బ్రిటన్ కి వెళ్ళే విమానాలను నిషేధించారు.

ఇప్పటికే నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాలు విమానాలని నిలిపివేసాయి. బ్రిటన్ ఒక్కటే కాదు యూరోపియన్ దేశాల్లో కరోనా కొత్తరూపం భయంకరంగా విజృంభించేలా ఉందని అంటున్నారు. ఈ కారణంగా కరోనాని కట్టడి చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా విమాన సర్వీసులు నిలిపివేసారు. లాక్డౌన్ ఎలాగూ ఉండాల్సిందే. ఇండియా నుండి బ్రిటన్ వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేసుకోవాలన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news